Followers

Wednesday, August 25, 2010

దేశమంటే... (ఝుమ్మందినాదం)

మనిషి అనేవాడు సంఘంపట్ల ఎంత భాధ్యతతో ఉండాలో వివరిస్తూ, మహాకవి శ్రీశ్రీ గారి ’నేను సైతం...’ స్పూర్తిని రుద్ర వీణ లో (సీతారామ శాస్త్రి గారు) ఒకసారి, ఠాగూర్ (అశోక్ తేజ గారు) సినిమాలో మరోసారి, విప్లవ ధోరణిని మనకు పంచారు. అదే స్పూర్తిని చంద్రబోస్ గారు ఝుమ్మందినాదం సినిమాలో, మహాకవి గురజాడ వారి ’దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్!’ అన్న సాంఘీక భాధ్యతని, తనదైన శైలిలో, సమాజంలో మనిషి ఎలా ఉండకూడదో అద్బుతంగా ఈ క్రింది పాటలో ఆవిష్కరించారు. బాలు గారు అదే స్ధాయిలో పాడి, ఇంకోసారి తమ ప్రజ్ణామృతాన్ని మనకు ధారపోశారు (ఇంకెవరికి సాధ్యం!). ఈ ప్రయత్నంలో మొదటి ఇద్దరికి జాతీయ పురస్కారం లభించిది. అర్హతగల ఈ గేయం కూడా ఆ కీర్తిని సంపాదించాలని ఆశిస్తున్నాను.

దేశమంటే...
దేశమంటే మతం కాదోయ్ గతం కాదోయ్
అడవి కాదోయ్ గొడవ కాదోయ్
అన్న చేతి గన్ను కాదోయ్
క్షుద్రవేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదోయ్
తీవ్ర వ్యాధిగ మారుతున్న తీవ్రవాదం కాదు కాదోయ్
దేశమంటే...
గడ్డి నుండి గగన మంటిన కుంభకోణం కాదు కాదోయ్
చట్ట సభలో పట్టుకున్న జుత్తు జుత్తు కాదు కాదోయ్
రాజధానుల రాచభవనపు రాసలీలలు కాదు కాదోయ్
అబలపై ఆమ్లాన్ని చల్లె అరాచకం కాదు కాదోయ్
పరిధి దాటిన గాలి వార్తల ప్రసారాలు కాదు కాదోయ్
సందు దొరికితె మంది చెసే సమ్మె కాదోయ్ బందు కాదోయ్
ప్రాణ ధన మానాలు తీసే పగల సెగల పొగలు కాదోయ్
దేశమంటే...
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్


ఆఅ ఆఆ ఆఆ ఆఆఆ ఆఆఆ 
ఝ్హనన ఝననన తరన తననన
ఝ్హనన ఝననన తరన తననన
ఝ్హనన తానన తరన తానన తనననన


ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు
ద్వేషమెందుకు సాటి మనిషిని సొదరుడిగ ఆదరించు || ప్రేమించు ||
హింసలెందుకు సమస్యలను నవ్వుతు పరిష్కరించు || ప్రేమించు ||
క్రొధమెందుకు కరుణ పంచు
స్వార్ధమెందుకు సహకరించు
పంతమెందుకు పలకరించు
కక్షలెందుకు కౌగిలించు || ప్రేమించు ||
మల్లె పువ్వుల లాంటి బాలల తెల్ల కాగితమంటి బ్రతుకులు
రక్త చరితగ మారకుండ రక్ష కలిగించు
కొత్త బంగరు  భవిత నీదె కానుకందించు || ప్రేమించు ||


దేశమంటే...
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్.

YouTube links:
దేశమంటే... (ఝుమ్మందినాదం) http://www.youtube.com/watch?v=cV-Akqt3pOw
నేను సైతం... (రుద్ర వీణ) http://www.youtube.com/watch?v=hz1H9IreJwY
నేను సైతం... (ఠాగూర్) http://www.youtube.com/watch?v=Biw2nnPIEaU

Sunday, August 22, 2010

సిరికిం జెప్పడు... (గజేంద్ర మోక్షం)

22nd Aug 2010 - 12:12am.
ఈ రోజు, ఈనాడు పేపర్ ’ఆదివారం అనుబంధం’ లో ’భాగవతుల వేంకట పరమేస్వర రావు’గారి ప్రతిభ గురించి రాస్తూ గజేంద్ర మోక్షం లోని ఈ పద్యాన్ని ప్రస్తావించారు. ఎప్పుడో మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను. బ్లాగులో పెట్టాలనిపించింది.


"సిరికిం జెప్పడు; శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడే

పరివారంబును జీర డభ్రగపతిం బన్నింప డాకర్ణికాం

తర ధమ్మిల్లము జక్క నొత్తడు వివాదప్రోత్థిత శ్రీ కుచో

పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై."