4th August:
కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పుట్తిన రోజు సందర్బంగా....
నాకు అత్యంత ఇష్టమైన వారి కవిత ఇక్కడ, మన అందరి కోసం.
పుష్ప విలాపము:
నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని ప్రొద్దున్నే మా తోటలోనికి వెళ్ళాను ప్రభూ!
ఉదయశ్రీ అరుణారుణ కాంతులతో ఉద్యానవనం కలకలలాడుతోంది!!
పూల బాలలు తల్లి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి!!!
అప్పుడు
నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మవంచి
గోరానెడు నంతలోన విరులన్నియు జాలిగ నోళ్ళు విప్పి
మా ప్రాణము తీతువాయనుచు
బావురుమన్నవి కృంగిపోతి
నా మానసమందేదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై
అంతలో ఒక సన్నజాజికన్నె సన్నని గొంతుకతో నన్ను చూసి యిలా అన్నది ప్రభు!
ఆయువుగల్గు నాల్గు గడియల్ కనిపించిన తీగతల్లి జాతీయత దిద్ది తీర్తుము
తదీయ కరమ్ములలోన స్వేచ్చమై నూయల లూగుచున్ మురియుచుందుము
ఆయువు తీరినంతనే హాయిగ కన్ను మూసెదము ఆయమ చల్లని కాలి వ్రేళ్ళపై
ఎందుకయ్యా మా స్వేచ్చా జీవనానికి అడ్డు వస్తావు, మేము నీకేం అపకారం చేసాం!
గాలిని గౌరవింతుము సుగంధము పూసి
సమాశ్రయించు బృంగాలకు విందు చేసెదము కమ్మని తేనెలు
మిమ్ముబోంట్ల నేత్రాలకు హాయి గూర్తుము స్వతంత్రులమమ్ముల స్వార్ధబుద్ధితో తాళుము
త్రుంపబోకుము తల్లికి బిడ్డకి వేరుచేతువే
యింతలో ఒక గులాబి బాల కోపంతో ముఖమంతా ఎర్రబడి యిలా అంది ప్రభూ..
ఊలు దారాలతో గొంతుకురిబిగించి గుండెలోనుండి సూదులు గ్రుచ్చి కూర్చి,
ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము అకటా దయలేనివారు మీ ఆడవారు
పాపం మీరు దయాదాక్షిణ్యాలుగల మానవులు కాబోలునే
మా వెలలేని ముగ్ధసుకుమార సుగంధ మరంద మాధురీ
జీవితమెల్ల మీకై త్యజించి కృశించి నశించిపోయే
మా యౌవనమెల్ల కొల్లగొని ఆపై చీపురుతోడ చిమ్మి
మమ్మావల పారవోతురుగదా నరజాతికి నీతియున్నదా
:వోయీ మానవుడా
బుద్ధదేవుని భూమిలో పుట్టినావు
సహజమగు ప్రేమ నీలోన చచ్చనేమి
అందమును హత్య చేసెడి హంతకుండా
మైలపడిపోయెనోయి నీ మనుజ జన్మ
అని దూషించు పూలకన్నియల కోయలేక వట్టిచేతులతో వచ్చిన
నాయీ హృదయ కుసుమాంజలినిగైకొని
నాపై నీ రేఖలను కరుణశ్రీ ప్రసరింపుము ప్రభు!
ప్రభూ....!!
No comments:
Post a Comment