అమ్మమ్మ, నాయనమ్మ!!
నాకింకా గుర్తు.. నీ చూపు
నాతో ఆడుకోవాలని!
నాకు మాత్రం నువ్విచ్చే ’పాపిన్స్’!!
నాకింకా గుర్తు.. నీ స్పర్శ
నాతో పడుకోవాలని!
నాకు మాత్రం నువ్వు చెప్పే కంచికి పోయే కధలు!!
నాకింకా గుర్తు.. నీ లాలన
నన్ను కౌగిలించుకోవాలని!
నాకు మాత్రం ఆ గారబంలో చేతికి తగిలిన నీ కొంగుముడిలో పావల!!
నాకింకా గుర్తు.. నీ పూజలు
నేను గొప్పవాడిని అవ్వాలని!
నాకు మాత్రం ఆ నైవైద్యంలోని చక్ర పొంగలి, పాయసం!!
నాకింకా గుర్తు..
దీపావళి దివిటీలు, అరటిపూవు బజ్జీలు, రధం ముగ్గులు, నీ పెద్ద బొట్టు, తులసి చెట్టు..
ఈ గుర్తులు నేర్పాయి నాకో కొత్త భాధ్యత!
నా పిల్లలను వాళ్ళ అమ్మమ్మ, నాయనమ్మ లకు ఇంకా దెగ్గర చేయమని!!
గుర్తులందరికి సమానమేనని!!!

1 comment:

బావుందండి.మీరు చెప్పింది నిజం.
Post a Comment